నారా లోకేష్‌తో వీహెచ్‌పీ నేతల భేటీ.. పలు కీలక అంశాలపై మంత్రి హామీ
- మంత్రి లోకేష్‌ను కలిసిన విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు
- గోసంరక్షణ, ఆలయ భూముల పరిరక్షణపై కీలక వినతులు
- గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేస్తామని లోకేష్ హామీ
- ధార్మిక కార్యక్రమాలకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్న వీహెచ్‌పీ
- హిందూ ధర్మ పరిరక్షణకు పూర్తి సహకారం అందిస్తామన్న మంత్రి
రాష్ట్రంలో హిందూ ధర్మ పరిరక్షణ, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రకటించింది. ఈ మేరకు వీహెచ్‌పీ ముఖ్య నేతలు నేడు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గోసంరక్షణ, దేవాలయ భూముల పరిరక్షణ, పురాతన ఆలయాల పునరుద్ధరణ వంటి పలు కీలక అంశాలపై వారు మంత్రితో చర్చించారు. వీహెచ్‌పీ ప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై సానుకూలంగా స్పందించిన మంత్రి లోకేష్, వారికి పలు హామీలు ఇచ్చారు.
మంత్రి లోకేష్‌ను కలిసిన వారిలో విశ్వహిందూ పరిషత్ భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ళ సత్య రవికుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్ఎస్ఎస్ కార్యకర్త దొరస్వామి, ఏపీ వీహెచ్‌పీ కోశాధ్యక్షుడు వలిపర్తి దుర్గా ప్రసాద్ రాజు, ఏపీ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాకాల త్రినాథ్ ఉన్నారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ నేతలు పలు కీలక అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో డ్రగ్స్‌పై ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల తరహాలోనే, అక్రమ గోరవాణా, గోవధపై కూడా ఉక్కుపాదం మోపాలని వారు విజ్ఞప్తి చేశారు. గోసంరక్షణ కోసం మరిన్ని గోశాలల నిర్మాణం చేపట్టాల్సిన ఆవశ్యకతను వివరించారు.
దేవాలయాల నిర్వహణ, భూముల పరిరక్షణపై కూడా వారు పలు సూచనలు చేశారు. ఆలయాలను కేవలం పూజా స్థలాలుగానే కాకుండా, ధార్మిక ప్రచారం, సామాజిక సేవా కార్యక్రమాలకు కేంద్రంగా మార్చాలని సూచించారు. ధార్మికతకు భంగం కలగకుండా ఆలయ భూములపై ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలని కోరారు. దీర్ఘకాలిక లీజు విధానాన్ని సవరించాలని, అన్యాక్రాంతమైన భూములను వెంటనే స్వాధీనం చేసుకుని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో హిందువులపై బనాయించిన అక్రమ కేసులను తక్షణమే తొలగించాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు, పీఠాధిపతులు, ధార్మిక పెద్దలతో పూర్తిస్థాయి ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేయాలని సూచించారు.
వీహెచ్‌పీ ప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించారు. గత ప్రభుత్వంలో హిందూ భక్తులపై పెట్టిన అక్రమ కేసులను కచ్చితంగా తొలగిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. హిందూ ధర్మ పరిరక్షణకు, ధార్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. హిందూ సమాజంలో భక్తిభావాన్ని పెంపొందించేందుకు వీహెచ్‌పీ చేపట్టే కార్యక్రమాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.